రాత్రుళ్లో నిద్ర తప్పని సరి.. లేదంటే నిద్రలేమి సమస్యకు దారితీస్తుంది. ఈ టిప్స్ పాటించండి..
పగలు ఎక్కువసేపు పడుకుంటే రాత్రి పూట నిద్ర అవసరం తగ్గుతుంది. కాబట్టి పగటి నిద్రను మానేస్తే మంచిది.
పడుకోవటానికి కొద్ది గంటల ముందే శరీరాన్ని నిద్రకు సన్నద్ధం చేయాలని సూచిస్తున్నారు. రాత్రి ఏ పనీ పెట్టుకోవద్దు.
రాత్రి పూట ఇష్టమైన పుస్తకం చదవటం, శ్రావ్యమైన సంగీతాన్ని వినటం, ధ్యానం చేయటం వంటి మనసుకు విశ్రాంతినిచ్చే పనులు చేయాలి.
ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే.. రోజూ ఉదయాన్నే వ్యాయామం చేయటం ఉత్తమం.
నడక, పరుగు, సైకిల్ తొక్కటం వంటివి చేస్తే మనసు, శరీరం ఉత్సాహంతో తొణికిసలాడి.. రాత్రిపూట గాఢంగానూ నిద్ర పడుతుంది.
షిఫ్ట్ ఉద్యోగులు, తరచూ రాత్రిపూట ఆలస్యంగా పడుకునేవారిలో నిద్ర లేమి సమస్యలు తలెత్తుతాయి.
కాబట్టి రోజూ ఒకే సమయానికి పడుకోవటం, లేవటం చాలా ముఖ్యం. దీంతో నిద్ర వేళలు నియమబద్ధం అవుతాయి.
వీలైతే సాయంత్రం వేళ గోరు వెచ్చటి నీటితో స్నానం చేయటం, గ్లాసు పాలు తాగటం, లైట్ల వెలుగు తగ్గించడం ద్వారా నిద్ర పడుతుంది.
సాయంత్రం వేళల్లో కాఫీ, టీ ఎక్కువగా తాగేవారికి రాత్రి నిద్ర పట్టటం కష్టమవుతుంది.
అంతే కాకుండా.. రాత్రి కూల్ డ్రింకులు, రెడ్ వైన్, చాక్లెట్లు, ఛీజ్ వంటివీ తినకూడదు. ఇవి నిద్రకు భంగం కలిగిస్తాయి.