ఉదయం, రాత్రి చొప్పున రోజుకు రెండుసార్లు బ్రష్ చేసుకోవాలి. ముఖ్యంగా.. రాత్రి పడుకునే ముందు బ్రష్ చేయడం తప్పనిసరి.

ఉదయాన్నే పళ్లు తోముకునేటప్పుడు నాలుకను టంగ్ క్లీనర్‌తో శుభ్రపరచుకోవాలి.

పళ్లల్లో ఇరుక్కున పదార్థాలన్నీ బ్రషింగ్‌తో పోవు. అప్పుడు దారంతో పళ్లమధ్య ఉన్నవాటిని తొలగించాలి. రోజుకు ఒక్కసారైనా ఇలా చేయాలి.

నోటిని డ్రైగా ఉంచుకోకూడదు. నీరు తగినంత తీసుకోవాలి. ఏదైనా తిన్న వెంటనే నీటిని పుక్కిలించి వేయాలి. ఇలా చేస్తే, నోటిని కడుక్కున్నట్టు అవుతుంది.

కూల్ డ్రింక్స్, ఆల్కహాల్‌కు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలి.

ఉల్లిపాయలు, వెల్లుల్లి, తీపి పదార్థాలు ఎక్కువగా తినడం కూడా నోటి దుర్వాసనకు కారణమవుతాయి.

టూత్ బ్రష్‌ను ప్రతీ మూడు నెలలకు ఒకసారి మార్చడం మంచిది. కనీసం ఏడాదికి ఒకసారి అయినా డెంటిస్ట్ ను సంప్రదించడం మంచిది.

ఆపిల్ లేదా క్యారెట్లను రోజు తినాలి. వీటి వల్ల పళ్ళపై ఒత్తిడి పెరిగి, వాటిపై పేరుకున్న మలినాలు క్లీన్ అవుతాయి.