రాత్రి పూట గోరు వెచ్చని పాలలో ఒక టీస్పూన్ తేనెను కలుపుకుని తాగాలి.
పాలు, పెరుగు, చెరుకు రసం, అరటి పండ్లు, యాపిల్, నారింజ, దానిమ్మ వంటి ఆహారాలను తీసుకోవాలి.
వారానికి ఒకసారి శరీరం మొత్తానికి నూనె పట్టించి మర్దనా చేసి స్నానం చేయాలి.
రాత్రి నిద్రకు ముందు గోరు వెచ్చని నీళ్లతో స్నానం చేస్తే నిద్ర బాగా పడుతుంది.
నిద్రకు ముందు అరిపాదాలను లావెండర్ నూనె లేదా తేనెతో మర్దనా చేయాలి.
ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో అర టీస్పూన్ అశ్వగంధ చూర్ణం కలిపి తాగాలి.
పాలలో చిటికెడు జాజికాయ చూర్ణం లేదా బాదం పప్పు, దాల్చిన చెక్క, యాలకుల పొడి వేసి తాగాలి.