హైదరాబాద్ యువకులు అన్నింటిలో ఫస్ట్ ఉంటారన్న విషయం తెల్సిందే
అయితే అమ్మాయిలతో మాట్లాడే విషయంలో హైదరాబాద్ అబ్బాయిలు చాలా వీక్ అంట
ప్రముఖ డేటింగ్ యాప్ టిండర్ చేసిన ఒక సర్వేలో ఈ విషయం బయటపడింది
పదిమంది యువకుల్లో ఆరుగురికి అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో తెలియదట
డేట్ కి ఎలా పిలవాలి.. అమ్మాయిలను ఎక్కడికి తీసుకెళ్లాలి అనేది కూడా తెలియదని చెప్పుకొచ్చారు
ఇక రొమాన్స్ విషయంలో అయితే మరీ అమాయకులట హైదరాబాదీ కుర్రాళ్లు
అమ్మాయిలతో రొమాంటిక్ విషయాలు మాట్లాడాలంటే హైదరాబాద్ యువకులు జంకుతారట
టిండర్ చేసిన ఈ సర్వేలో వీక్ సిటీగా హైదరాబాద్ ఉందట
హైదరాబాద్ తరువాత చెన్నై, బెంగుళూరు ఉన్నాయని తెలిపింది
అమ్మాయిలను కలవడానికి ఇష్టపడని వీరు వారితో ఆన్ లైన్ లో మాట్లాడానికి మాత్రం ముందు ఉంటారట