చెడు అలవాట్లు మానడం కాస్త తేలిక... కానీ వ్యసనాన్ని మానడం కష్టం.
అలాంటి వాటిలో అశ్లీల వీడియోలు లేదా పార్న్ వీడియోలు చూడటం కూడా ఒకటి.
దీన్నుంచి బయటపడాలని ప్రయత్నిస్తున్నా మానలేని స్థితిలోనూ కొందరుంటారు. వారి కోసమే ఈ చిట్కాలు..
మీ ఫోన్‌కి పేరెంటల్ లాక్ పెట్టుకోండి. దీంతో అది చెడు వీడియోలు మీరు చూడాలనుకున్న ప్రతీసారీ చూడలేరని గుర్తు చేస్తుంది.
ఒంటరిగా ఉండటం, ఒత్తిడి, బాధ, డిప్రెషన్ నుంచి బయటపడటానికి, బోరింగ్ గా ఫీల్ అవుతున్నప్పుడు.. చూసే అవకాశం ఉంటుంది.
ఇలా దేనివల్ల మీకు ఆ వీడియోలు చూడాలి అనిపిస్తుందో కారణం తెల్సుకోండి. దీంతో ఈ అలవాటు మానుకోవచ్చు.
పుస్తకాలు చదవడం, సంగీతం వినడం, ఆటలు ఆడటం, వ్యాయామం, వాకింగ్ చేయడం ఏదో ఒకటి అలవాటు చేసుకోండి.
ధ్యానం చేయడం వల్ల మీ మనసు మీద మీకు నియంత్రణ పెరుగుతంది. మనసులో, ఆలోచనల్లో చాలా మార్పు వస్తుంది.
ముందుగా మీదగ్గర హార్డ్ కాపీలు, సాఫ్ట్ కాపీలు ఉంటే వాటిని డిలీట్ చేయండి.
దేనికైనా సమయం పడుతుంది. కాబట్టి క్రమంగా బయటపడండి. మానేయలేకపోతున్నాం అని ఆందోళన పడకండి.