స్మార్ట్‌ఫోన్లను ఎక్కువగా వాడితే సమస్యేనట.. ఈ వ్యసనాన్ని దూరం చేసుకోవాలంటున్నారు నిపుణులు.
ఎక్కువగా వాడే యాప్‌ల నోటిఫికేషన్‌లను ఆపివేసి, దాన్ని ఓపెన్ చేసినప్పుడే పనిచేసేలా సెట్టింగ్స్ మార్చండి.
రోజులో ఏయే యాప్‌లతో ఎక్కువ సమయం గడుపుతున్నారో తెలుసుకోవాలి.
ఈ రోజుల్లో ఫోన్‌కు దూరంగా ఉండలేం, కనీసం వాడకాన్ని పరిమితం చేసి దానికి బానిస కాకుండా జాగ్రత్త పడవచ్చు.
ఖాళీ సమయంలో స్నేహితులతో గడపడం, కుటుంబసభ్యులతో బయటకు వెళ్లడం వల్ల ఫోన్‌కు దూరంగా ఉండొచ్చు.
ఫోన్ పక్కన ఉంటే దాన్ని అదేపనిగా వాడాలనిపిస్తుంది కాబట్టి దూరంగా ఉంచాలి.
నిద్రపోయేముందే స్మార్ట్‌ఫోన్‌ను మంచానికి కనీసం ఆరు అడుగుల దూరంలో పెట్టాలి.
అవసరం ఉన్నా, లేకపోయినా కొన్ని యాప్‌లను వాడుతేనే ఉంటాం. ఇలాంటి వాటిని ఫోన్ నుంచి అన్‌ఇన్‌స్టాల్ చేయాలి.
సోషల్ మీడియా యాప్‌లను కూడా తీసివేసి, ఖాళీ సమయాల్లో వాటిని వెబ్‌సైట్‌లో ఓపెన్ చేసుకుంటే ఎంతో సమయం ఆదా అవుతుంది.