రోజు మన డైట్‌లో పండ్లు తీసుకుంటే మన ఆరోగ్యంతో పాటు చర్మానికి కూడా ఎంతో మేలు జరుగుతుందని మనకు తెలుసు.

పండ్లలో ఉండే పోషకాలు వృద్ధాప్య ఛాయలు రాకుండా కాపాడతాయి. అందుకే.. బ్యూటీ ప్యాక్స్‌లో పండ్ల గుజ్జును వాడుతూ ఉంటాం. 

పండ్లే కాదు.. వాటి తొక్కలూ అందాన్ని సంరక్షించడానికి, చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చడానికి సహాయపడతాయి. 

కమల తొక్కలు కమల తొక్కలలోని పోషకాలు.. డార్క్‌ స్పాట్స్‌ను తొలగిస్తాయి, చర్మం రంగును మెరుగుపరుస్తాయి. చర్మంలోని అదనపు జిడ్డు, మురికిని తొలగిస్తుంది. మొటిమల సమస్యను పరిష్కరిస్తుంది.

నిమ్మ తొక్కలు నిమ్మ తొక్కలు మన బ్యూటీ కేర్‌లో యాడ్‌ చేసుకుంటే.. ముడతల సమస్య దూరం అవుతుంది, వృద్ధాప్య ఛాయలు దూరం అవుతాయి. చర్మాన్ని టైట్‌గా చేస్తుంది. మొటిమల సమస్యను నివారిస్తుంది. చర్మంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి హైపర్‌పిగ్మెంటేషన్‌ను తగ్గిస్తుంది.

అరటి తొక్క అరటి తొక్కలో ‘బి6’, ‘బి12’ విటమిన్లు, మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్‌, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని మృదువుగా మారుస్తాయి. అంతేకాదు ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్‌-సి చర్మంపై ముడతలను తగ్గించడంలో సహాయపడతాయి.

యాపిల్‌ తొక్క యాపిల్‌ తొక్కలోని పోషకాలు.. స్కిన్‌ టోన్ మెరుగుపరుస్తాయి. యాపిల్‌ పీల్‌‌ స్కిన్‌ కేర్‌లో వాడితే.. చర్మం హైడ్రేట్‌గా ఉంటుంది. చర్మానికి మంచి మాయిశ్చరైజర్‌గా పని చేస్తుంది. మొటిమలు, నల్లటి వలయాలను నయం చేస్తుంది.

దానిమ్మ తొక్కలు దానిమ్మ తొక్కలు.. చర్మంలోని మృతకణాలను తొలగిస్తుంది. చర్మానికి రక్త ప్రసరణను పెంచుతుంది. చర్మానికి కావలసిన తేమను అందిస్తుంది. ముడతలను తగ్గిస్తుంది, వృద్ధాప్య ఛాయలను నివారిస్తుంది. 

మామిడి తొక్కల మామిడి తొక్కలలో.. విటమిన్ ఎ, సి, బి6, పొటాషియం, కాపర్, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి. ఇవి చర్మ కణాలకు నష్టం జరగకుండా సహాయపడతాయి.

బొప్పాయి తొక్కలు బొప్పాయిలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, బయో ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది. చర్మంపై ముడతలు, గీతలును తొలగిస్తుంది. కంటి కింద నల్లటి వలయాలను దూరం చేస్తుంది.