ప
లు ఆహారాలు తినడం వల్ల మల్టీ విటమిన్లు అందుతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
పాలకూర వంటి ఆకుకూరల్లో ఎ, సి, ఇ, కె విటమిన్లు దండిగా ఉంటాయి.
ఇందులో ఫోలేట్, ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం కూడా లభిస్తాయి. రోజూ ఆహారంలో ఆకుకూరలు ఉండేలా చూసుకోండి..
బాదంలో విటమిన్ ఇ, మెగ్నీషియం, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాల వంటి పోషకాలు ఉంటాయి.
రోజూ గుప్పెడు తింటే.. రకరకాల శరీరానికి కావాల్సిన పోషకాలు లభిస్తాయి.
చిక్కుళ్లు, శనగ, కంది, పెసర, రాజ్మా వంటి పప్పుల్లో బి1, బి6, ఫోలేట్ బాగా ఉంటాయి.
ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలూ ఎక్కువే. వీటిల్లో ప్రొటీన్, పీచు సైతం దండిగా ఉంటాయి.
జామ, రేగు పండ్లలో విటమిన్ సి దండిగా ఉంటుంది. కండరాల పనితీరును నియంత్రించే, ఎలక్ట్రోలైట్లను సమతూకంలో ఉంచే పొటాషియం కూడా ఎక్కువే.
గుడ్లలో విటమిన్ డి, బి12 వంటి విటమిన్లతో పాటు ఖొలీన్, సెలీనియం, బయోటిన్ ఖనిజాలు ఉంటాయి.
సజ్జలు, సామలల్లో ఇనుము నిండుగా ఉంటుంది. మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్ఫరస్, జింక్ వంటి ఖనిజాలూ ఉంటాయి.