ఉపవాసం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అధ్యయనాల్లో తేలింది.
మన శరీరంలోని చెడు కొవ్వులు ఉపవాస ఫలితంగా కరిగే అవకాశం ఉంది.
అయితే ఉపవాసం చేస్తున్నవారు మాత్రం ఈ 5 రకాల ఆహార పదార్థాలను అస్సలు తీసుకోవద్దు.
కార్బోహైడ్రేట్ ఫుడ్
ఉపవాసం వల్ల మీ శరీరం కార్బోహైడ్రెట్ ఫుడ్ ను జీర్ణం చేసుకోలేదు. అందువల్ల పూరీలు, ఫ్రెంచ్ ఫ్రైస్, పొటాటో చిప్స్, రైస్ వంటి వాటి దూరంగా ఉండాలి.
నిల్వ చేసిన ఆహారం..
నిల్వ చేసిన ఆహారంలో అనేక ప్రజర్వేటివ్స్, షుగర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. దీంతో పాటు ఇది తక్కువ పోషక విలువలు ఉంటాయి.
కార్బోనేటెడ్ డ్రింక్స్..
సోడా, ఫిజ్ వంటి కార్బోనేటెడ్ డ్రింక్స్‌కు దూరంగా ఉండాలి. ఖాళీ కడుపుతో ఇవి తీసుకుంటే కడుపులో ఒత్తడి పెరుగుతంది.
చెక్కర అధికంగా ఉండే ఆహారం
గులాబ్ జామున్, లడ్డూలు, ఖీర్ వంటి తీపి పదార్థాలకు దూరంగా ఉండాలి. ఉపవాసం తర్వాత వీటిని తీసుకుంటే బ్లడ్ షుగర్ ఒకేసారి విపరీతంగా పెరుగుతుంది.
ఉప్ప అధికంగా ఉండే ఆహారం..
ఉపవాసంతో ఉన్నప్పుడు తక్కువ ఉప్పు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం ఉత్తమం. ఇది బీపీని తగ్గిస్తుంది.