బీట్‌రూట్ తీసుకోవడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ పెరగడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయనేది మనందరికీ తెలిసిన విషయమే.
బీట్ రూట్‌లో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో విటమిన్లు, ఐరన్, ఫోలిక్ యాసిడ్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
హిమోగ్లోబిన్ , ఆక్సిజన్ స్థాయిలు పెరుగుతాయి. అయితే, బీట్ రూట్ వినియోగం కొన్ని సందర్భాల్లో శరీరానికి హాని కలిగిస్తుందని చెబుతున్నారు.
బీట్ రూట్ లలో ఆక్సలేట్ పుష్కలంగా ఉంటుంది , కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి దారితీస్తుంది.
బీట్‌రూట్ తీసుకోవడం వల్ల మూత్రంలో ఆక్సలేట్ విసర్జనను పెంచుతుంది, ఇది కాల్షియం ఆక్సలేట్ రాళ్ళు ఏర్పడటానికి దారితీస్తుంది.
బీట్ రూట్ లను కొంత పరిమాణంలో మాత్రమే తినమని సలహా ఇస్తారు. మీకు కిడ్నీ స్టోన్ సమస్య ఉంటే బీట్ రూట్ రసం తాగడం మానుకోండి.
బీట్ రూట్ ల వినియోగం డయాబెటిక్ రోగులలో కూడా సమస్యలను కలిగిస్తుంది. బీట్ రూట్ లు మధుమేహ వ్యాధిగ్రస్తులలో నరాల దెబ్బతినే ప్రమాదం ఉంది. శరీరంలో ఫైబర్ తగ్గిపోయి గ్లైసెమిక్ లోడ్ పెరుగుతుంది.
కొంతమందిలో బీట్‌రూట్ ఎక్కువగా తినటం వల్ల అనాఫిలాక్సిస్ అనేది తీవ్రమైన అలెర్జీ సమస్య ఎదురయ్యే అవకాశం ఉంటుంది. గొంతు సమస్యలు కూడా వస్తాయి.
బీట్‌రూట్ జ్యూస్‌లో నైట్రేట్‌లు ఎక్కువగా ఉంటాయి. వీటిని శరీరం నైట్రిక్ ఆక్సైడ్‌గా మారుస్తుంది. అధిక రక్తపోటు, హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.