చింపాంజీల పిల్లల్ని చంపి మాంసాన్ని పంచుకొని తింటాయి. సంతానోత్పత్తి అవకాశాలను పెంచడానికే అవి ఇలా చేస్తాయంటారు.

మగ సింహాలు త్వరగా ఆడపులుల సంతానోత్పత్తి కోసం మగ పిల్లలను చంపి తింటుంది.

చిట్టెలుక తల్లులు పోషకాహార లోపంతో బాధపడుతున్నప్పుడు వాటి పిల్లలను చంపుకుని తింటుంది.

కాల్షియం లోపాన్ని కవర్ చేసుకోవడానికి చాలా సార్లు కోడి తన గుడ్లను తింటుంది. పొదిగే దశలో ఉన్న గుడ్డును పొడుచుకొని తింటాయనే విషయం చాలా మందికి తెలియదు.

తమకు ముప్పు కలుగుతుందని భావిస్తే కొన్ని తేళ్లు వాటి పిల్లలను తింటాయట.

ఎలాంటి ఆహారం దొరకనప్పుడు కొన్ని రకాల బల్లులు వాటి పిల్లలను తినేస్తాయి.

కొన్ని పాములు కూడా ప్రత్యేక సందర్భాల్లో తమ పిల్లలను తింటాయి.

ఆహారం దొరకనప్పుడు ధ్రువపు ఎలుగుబంట్లు తమ పిల్లలను తింటాయట.

కుక్కలలో బ్లాక్-టెయిల్డ్ ప్రేరీ డాగ్ అనే జాతికి చెందిన శునకాలు వాటికి పుట్టిన కుక్క కూనలను చంపి తింటాయి.