ప్రతి రోజూ ఉదయం వాల్ నట్స్ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
వాల్‌నట్స్‌లో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి.
పీచు పదార్థాలు, ప్రొటీన్లు, విటమిన్ – బి, మాంగనీస్, మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్, సెలీనియం పుష్కలంగా ఉంటాయి.
ఒమేగా – 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మోతాదులో ఉండే ఆహార పదార్థాల్లో వాల్‌నట్స్ ఒకటి.
ఉదయాన్నే వాల్‌నట్స్ తినడం వల్ల ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గేందుకు దోహదం చేస్తుంది.
ఇందులోని ఆల్ఫా లినోలిక్ యాసిడ్ ధమనులలో కొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
వాల్‌నట్స్‌లో ఉండే ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ శరీరాన్ని దృఢంగా చేస్తుంది.
రోజూ ఉదయాన్నే వాల్‌నట్స్ తినడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి.
ప్రతిరోజూ వాల్‌నట్‌లను తీసుకోవడం వల్ల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.
వాల్‌నట్స్‌లో మెదడు బాగా పని చేసే కొన్ని పోషకాలు ఉంటాయి. ఒత్తిడి భావాలను తగ్గిస్తుంది.
రోజూ 3 నుంచి 4 వాల్ నట్స్ తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్ సమస్య తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.