ప్రపంచంలో ప్రతి క్షణం ఎంతోమంది మరణిస్తుంటారు. అందులో అసహజ మరణాలూ ఉంటాయి.

సహజ మరణాల్లో మిస్టరీగా మిగిలేది మాత్రం కొన్నే..

అందులోనూ లండన్ లో చనిపోయిన జాయిస్ విన్సెంట్ తీరు మాత్రం అంతుచిక్కని మిస్టరీగానే మిగిలిపోయింది.

జాయిస్ విన్సెంట్ అక్టోబర్‌ 19, 1965 లండన్‌ జన్మించారు

జాయిస్ విన్సెంట్ మరణించిన తీరు మరింత ఆశ్చర్యకరంగా ఉంది.

2006లో విన్సెంట్ టీవీ చూస్తూ చనిపోగా..  ఆమె మరణాన్ని గుర్తించే సమయంలోనూ  టీవీ నడుస్తూనే ఉంది ఆమె అస్తిపంజరంలా మారిన ఆమె మృతదేహం

టీవీ చూస్తున్నట్లుగానే సోఫాలో కూర్చొని, చేతిలో టీవీ రిమోట్ పట్టుకొని ఉండటం అధికారులకే ఒళ్లు గగుర్పొడిచింది.

అయితే, విన్సెంట్ ఎలా మరణించిందనేది ఇప్పటికీ జవాబు లేని ప్రశ్నగానే మిగిలిపోయింది.

అధికారులకే ఒళ్లు గగుర్పొడిచిన విన్సెంట్ మృతి ఇప్పటికే మిస్టరీనే