క్యాన్సర్ ఓ భయంక‌ర‌మైన మ‌హ‌మ్మారి. దీన్ని తగ్గించేందుకు పలు రకాల ఆహారాలు ఎంతగానో ఉపయోగపడతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆకుకూరలు: పాలకూర, తోటకూరల్లో ఫైబర్‌, బీటా కెరోటీన్‌, లుటీన్‌, ఫోలేట్‌, కెరోటినాయిడ్స్‌ ఉంటాయి. ఇవి క్యాన్సర్‌ రాకుండా చూస్తాయి.

క్యారెట్: వీటిని నిత్యం ఆహారంలో భాగం చేసుకుంటే.. క్యాన్సర్లు వచ్చే అవకాశాలు చాలా తక్కువ అని పరిశోధనల్లో వెల్లడైంది.

బ్రోకలీ: ఇందులో ఐసోథియోసైనేట్‌, ఇండోల్‌ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి క్యాన్సర్‌ కారకాలను, క్యాన్సర్‌ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి.

టమాటో: ఇందులో క్యాన్సర్‌ నిరోధక లక్షణాలుంటాయి. ఇందులోని లైకోపీన్‌.. యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేసి, ప్రోస్టేట్‌ క్యాన్సర్ రాకుండా చూస్తుంది.

ద్రాక్ష: ఇందులో రెస్వెరాట్రాల్‌ అనే యాంటీ ఆక్సిడెంట్‌‌తో పాటు యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి క్యాన్సర్‌‌ని నివారిస్తాయి.

ఆపిల్: ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇవి క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

బ్లూబెర్రీస్: ఇవి యాంటీఆక్సిడెంట్ శక్తిని కలిగి ఉంటాయి. ఇవి నోరు, రొమ్ము, పెద్దప్రేగు, ప్రోస్టేట్ క్యాన్సర్ కణాలను నాశనం చేస్తాయి.

గ్రీన్ టీ: ఇందులో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఊపిరితిత్తులు, ప్యాంక్రియాటిక్, ప్రోస్టేట్, కాలేయ క్యాన్సర్‌లతో పోరాడుతాయి.

వాల్‌నట్స్: ఇందులో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ డయాక్సిటెండ్స్, ఫిటోస్ట్రెల్స్ వంటివి ఉంటాయి. ఇవి బ్రెస్ట్ క్యాన్సర్‌కు చెక్ పెడతాయి.