ఉల్లికాడల్లోని ఏ, సీ విటమిన్లు.. ఇన్‌ఫెక్షన్ల నుంచి కాపాడి, రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి.

ఉల్లికాడలు శరీరానికి సూక్ష్మపోషకాలను అందించడంతో పాటు జీవక్రియల్ని నియంత్రిస్తాయి.

ఉల్లికాడల్లోని అల్లిసిన్ రసాయనం.. చర్మం ముడతలు పడకుండా కాపాడుతుంది.

ఉల్లికాడలు ఇన్సులిన్ ఉత్పత్తి పెంచి.. రక్తంలో చక్కెర నిల్వలు పెరగకుండా చూస్తాయి.

కేన్సర్ కణాలను ఉత్పత్తి చేసే ఎంజైమ్‌ల విడుదలను నిలిపివేసే శక్తి ఉల్లికాడల్లో ఉంది.

ఉల్లికాడల్లోని కె,సి విటమిన్లు.. ఎముకలను ఆరోగ్యంగా, దృఢంగా ఉంచుతాయి.

ఉల్లికాడల్లోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు.. సాధారణంగా వచ్చే జలుబు, దగ్గును నివారిస్తాయి.

పెరుగులో ఉల్లికాడ ముక్కలను కలిపి, రోజుకి రెండుసార్లు తింటే పైల్స్ స‌మ‌స్య త‌గ్గుతుంది.

ఉల్లికాడల్లో ఉండే ఫోలేట్లు.. గుండె జబ్బులని అదుపులో ఉంచుతాయి.

ఉల్లికాడల్లో ఉన్న గ్జియాంతిన్ అనే పదార్థం కంటిచూపుని మెరుగుపరుస్తుంది.

ఉల్లికాడల్లో ఉన్న డైటరీ ఫైబర్ ఆకలిని అదుపులో ఉంచుతుంది. దీంతో.. బరువు సమస్య ఏర్పడదు.