రెడ్ రైస్ తినేటప్పుడు బాదం, జీడిపప్పులా కాస్త మెత్తగా ఉంటాయి. పాలిష్ చేసిన తెల్ల బియ్యంతో పోల్చితే.. వీటిలో ఎక్కువ పోషకాలు ఉంటాయి.
రెడ్ రైస్‌లో ఫైబర్ ఎక్కువగా, కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి. అందువల్ల ఎర్ర బియ్యం తినేవారికి మలబద్ధకం సమస్యే ఉండదు.
రెడ్ రైస్‌లో బ్లడ్ షుగర్‌ను తగ్గించే గుణాలు పుష్కలంగా ఉన్నాయి.
బ్లడ్‌లో కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని తగ్గించే శక్తి రెడ్ రైస్‌కి ఉంది. ఇందులోని మెగ్నీషియం బీపీని కంట్రోల్ చేసి.. గుండెని ఆరోగ్యంగా ఉంచుతుంది.
రెడ్ రైస్‌లో ఫైబర్ ఎక్కువగా ఉండటంతో.. అధిక బరువు రాకుండా చేస్తుంది. ఈ రైస్‌ని కొద్దిగా తిన్నా.. పొట్ట ఫుల్ అయినట్టు అనిపిస్తుంది.
రెడ్ రైస్‌లో ఐరన్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. శరీరంలో ఆక్సిజన్ వేళ్లేందుకు ఐరన్ అవసరం కాబట్టి.. ఈ రెడ్ రైస్ తింటే ఎంతో మేలు.
మన శరీరానికి బీ6 విటమిన్ గ్రూప్ చాలా అవసరం. DNAలో ఎర్రరక్త కణాలు తయారవ్వాలంటే ఈ విటమిన్ కావాలి. ఇది రెడ్ రైస్‌లో పుష్కలంగా ఉంటుంది.
రెడ్ రైస్‌లో ఆంథోసియానిన్, మాంగనీస్, జింక్ ఉంటాయి. ఇవి మన బాడీలో విషవ్యర్థాల్ని బయటకు తరుముతాయి.
రెడ్ రైస్‌లో యాంటీఆక్సిడెంట్లు , యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు.. క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించి, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
రెడ్ రైస్‌లో ఉండే కాల్షియం, మాంగనీస్.. ఎముకల్ని పుష్టిగా, గట్టిగా, బలంగా, మార్చేస్తాయి. ముసలితనంలో అస్థియోపోరోసిస్ వ్యాధి సోకదు.