హృద్రోగ సమస్యలను దూరం చేయడంలో ముల్లంగి కీలకంగా పని చేస్తుంది.
ముల్లంగిలో విటమిన్ ఏ, సీ, ఈ, బీ6, కే పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
ముల్లంగి రసం రోజూ తాగితే.. చర్మం కాంతిమంతమవుతుంది. మొటిమలు, రాషెస్ మాయమైపోతాయి.
ముల్లంగి పేస్టును ముఖానికి రాసుకుంటే.. క్లెన్సర్‌గా ఉపయోగపడుతుంది. మృతకణాలను తొలగిస్తుంది.
ముల్లంగి పేస్టుని తలకు పట్టిస్తే.. చుండ్రు, జుట్టు రాలడం తగ్గుతుంది. కేశాల కుదుళ్లు బలంగా మారుతాయి.
ముల్లంగిలో పొటాషియం అధిక మోతాదులో ఉంటుంది. అది రక్తనాళాలపై ఒత్తిడి తగ్గించి.. బీపీ నియంత్రిస్తుంది.
చలికాలంలో ముల్లంగి తింటే.. జలుబు, శ్వాసకోశ సంబంధిత ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనం పొందవచ్చు.
ముల్లంగిలో పీచు పదార్థం ఉంటుంది. ఇది శరీర బరువుని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. ఆహారంలో ముల్లంగిని చేర్చుకుంటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
ముల్లంగి విషపదార్థాలను బయటకు పంపి, మూత్రవ్యవస్థను ప్రక్షాళన చేస్తుంది. ఫలితంగా.. కిడ్నీ సమస్యలు తలెత్తవు.