బఠాణీలు నోటికి రుచినివ్వడమే కాదు, వీటి వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

బఠానీల్లో ఒమేగా 3 ఫ్యాట్స్, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలుంటాయి. ఇవి చర్మం ముడతలు పడకుండా చేస్తాయి.

అల్జీమర్స్, ఆర్థరైటీస్ వంటి జబ్బులను నిరోధించే పోషకాలు బఠాణీల్లోని పుష్కలంగా ఉంటాయి. 

కొవ్వు శాతం తక్కువగా ఉంటే బఠాణీల్లో ప్రోటీన్, ఫైబర్, పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారు వీటిని అధికంగా తీసుకోవచ్చు.

బఠాణీల్లో అధికమొత్తంలో ఫైటో న్యూట్రియెంట్స్ఉంటాయి. ఇవి పొట్ట క్యాన్సర్‌ కణాలకు వ్యతిరేకంగా పోరాడుతాయి.

ఫ్లేవనాయిడ్స్, యాంటీయాక్సిడెంట్స్ కలిగిన బఠాణీలను తినడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ మెరుగ్గా తయారవుతుంది.

బఠాణీలు తీసుకోవడం వల్ల రక్తసరఫరా సరిగ్గా జరుగుతుంది. దీని వల్ల టైప్ 2 డయాబెటిస్ రాకుండా ఉంటుంది.

బీ1, బీ2, బీ3, బీ6 విటమిన్స్ కలిగిన బఠాణీలు తీసుకోవడం వల్ల గుండె సమస్యల ముప్పు నుంచి తప్పించుకోవచ్చు.

బఠాణీల్లో విటమిన్ కే అధిక మోతాదులో ఉంటుంది. అది ఎముకల్ని బలంగా మార్చడంలో దోహదపడుతుంది.