సిట్రస్ జాతికి చెందిన దబ్బపండు.. పంపరపనస, నారింజ పండ్ల మధ్య సహజంగా జరిగిన సంకరీకణ ద్వారా పుట్టింది.

ఇందులోని విటమిస్ సి, బయోఫ్లేవనాయిడ్స్.. మన శరీరములోని వాత దోషములను నివారించడంలో తోడ్పడుతాయి.

ఇందులో యాంటీఆక్సిడెంట్స్ అధికంగాఉంటాయి. ఇవి అతిసారం, విరేచనాలు, కాలేయ సంబందిత సమస్యల్ని నివాయిస్తాయి.

దబ్బకాయ రసాన్ని రోజూ తీసుకుంటే.. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఫలితంగా.. జలుబు, దగ్గు వంటి వ్యాధులు దరిచేరవు.

దబ్బపండులో పీచు శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది కొలెస్టిరాల్‌ని కరిగి, గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

గుండె వేగాన్ని నియంత్రించేందుకూ, రక్తపోటు అదుపు చేసేందుకూ దబ్బపండు ఎంతగానో ఉపయోగపడుతుంది. 

మహిళలకు, పిల్లలకి కడుపులో నులిపురుగులు చేరి ఇబ్బందిపెడతాయి. దబ్బ రసంలో వాము, జీలకర్ర కలిపి తీసుకుంటే, వాటికి చెక్‌ పెట్టొచ్చు. 

ఆ దబ్బపండును రోజూ తింటే.. జుట్టు బాగా పెరుగుతుంది. జుట్టు రాలే సమస్య నియంత్రణలోకి వస్తుంది. తెల్లజుట్టు త్వరగా రాదు.

ఇందులో లైకోపీన్, గ్లూకారేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఊపిరితిత్తుల క్యాన్సర్‌, నోటి క్యాన్సర్లు, రొమ్ము క్యాన్సర్ రాకుండా కాపాడతాయి. 

ఎరుపు రంగులో ఉండే గ్రేప్ ఫ్రూట్‌లో.. లికోపిన్ ఉండటం వల్ల ఇది చర్మాన్ని అతినీలలోహిత కిరణాల నుంచి కాపాడుతుంది.

ఈ పండులో ఉండే లైకోపిన్‌, బీటా కెరోటిన్‌, క్సాంథిన్‌, ల్యూటిన్‌ వంటి ఫ్లవనాయిడ్స్.. కంటిచూపుని మెరుగుపరుస్తాయి. 

ఇందులో క్యాల్షియం, ఐరన్‌, కాపర్‌, ఫాస్ఫరస్‌, బి-కాంప్లెక్స్‌ ఉంటాయి. ఇవి ఊబకాయాన్ని నివారించేందుకు దోహదపడతాయి.

దబ్బకాయ షర్బత్‌ రోజూ తాగితే.. వాంతులు, దప్పిక, నోటిపూత, చిగుళ్ల వాపులు మటుమాయం అవుతాయి.

దబ్బపండు గుజ్జుని చర్మం మీద నెమ్మదిగా రుద్దితే.. మృతకణాలన్నీ తొలగి, నిగారింపుని తీసుకొస్తుంది.

అయితే.. ఈ దబ్బపండుని పడిగడుపున తీసుకోకూడదు. భోజనం తర్వాతే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.