చికెన్‌లో విటమిన్ B12, కోలిన్ ఉంటాయి. ఇవి పిల్లలలో మెదడు అభివృద్ధిని ప్రోత్సహిస్తాయి. నాడీ వ్యవస్థ సరిగా పనిచేయడంలోనూ సహాయపడతాయి.
కోడి మాంసంలో క్రొవ్వు తక్కువగా ఉంటుంది. ఇది సులువుగా జీర్ణమవుతుంది. కాబట్టి.. బరువు పెరుగుతారన్న అపోహలు వద్దు.
చికెన్‌లో ప్రొటీన్లు, అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇవి పిల్లల పెరుగుదలకు, కండరాల అభివృద్ధికి తోడ్పడుతాయి.
చికెన్‌లో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది మెదడులో సెరోటోనిన్ స్థాయిలను పెంచి, ఒత్తిడి నుంచి విముక్తి కలిగిస్తుంది.
చికెన్‌లో క్యాల్షియం, పాస్పరస్ ఉంటాయి. ఇవి ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి. చాలా సన్నగా ఉన్నవారు చికెన్ సూప్ ప్రతి రోజూ తీసుకోవచ్చు.
క్యాన్సర్‌తో పోరాడే లక్షణాలు చికెన్‌లో పుష్కలంగా ఉంటాయి. చికెన్ తినే వ్యక్తులకు క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువని ఓ పరిశోధనలో తేలింది.
చికెన్ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. దగ్గు, జలుబు ఉన్నప్పుడు చికెన్ సూప్ తాగితే.. త్వరగా ఉపశమనం లభిస్తుంది.
కోడి స్కిన్‌లో అన్ శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి రక్త పోటును నియంత్రిస్తాయి. గుండె పనితీరును మెరుగుపరుస్తాయి.
చికెన్ గుండెనొప్పి, గుండె సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. ఇందులో విటమిన్ బి6 అధికంగా ఉంటుంది. ఇది హోమోసిస్టీన్ స్థాయిలు తగ్గిస్తుంది.
చికెన్‌లో జింక్ అధికంగా ఉండటం వల్ల.. టెస్టోస్టెరాన్ (పురుష హార్మోన్) స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది.