ప్రేమికుల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు, ఒకరిపై మరొకరు విశ్వాసం కోల్పోయినప్పుడు
లవ్ బ్రేకప్ అవుతుంది.
లవ్ బ్రేకప్ తర్వాత సాధారణ స్థితికి ఆవడం చాలా కష్టం
లవ్ బ్రేకప్ తర్వాత రిలేషన్ కొనసాగించాలని జంటలో ఒకరు భావిస్తారు. అలాంటి ఫీలింగ్ ఉంటే దాన్ని పక్కన పెట్టి భవిష్యత్ గూర్చి ఆలోచించాలి.
మీతో మీరు ఎక్కువ సమయం గడిపేందుకు ప్రయత్నించండి. భవిష్యత్ లో చేరాల్సిన గమ్యాలు, కుటుంబం గురించి ఎక్కువగా ఆలోచించండి
లవ్లో ఉన్నప్పుడు విషయాలు గుర్తు తెచ్చుకోకండి. ప్రస్తుత విషయాలపై ఫోకస్ చేయండి. భవిష్యత్ లో ఏంచేయాలనే దానిపై ఆలోచించండి.
మీ బలాలు, బలహీనతలు గుర్తించి అసలు ఎటువంటి పార్టనర్ కావాలి అనే విషయాన్ని తెలుసుకుని, మీతో మీరే ఎక్కువ సమయం గడపాలి
లవ్ బ్రేకప్ తర్వాత ఒంటరిగా ఉంటే లేనిపోని ఆలోచనలు వస్తాయి.. అందుకే కుటుంబం, స్నేహితులతో ఎక్కువ సమయం గడపండి
లవ్ విషయంలో స్వయం నిర్ణయాలతో పాటు స్నేహితుల సలహాలు అడగండి. నచ్చితే వాటిని ఫాలో అవ్వండి
సోఫల్ మీడియా మానసిక ప్రశాంతతను దూరం చేసి గత జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది కాబట్టి బ్రేకప్ తర్వాత సోషల్ మీడియాకు దూరంగా ఉండండి.
బ్రేకప్ తర్వాత ఏం చేయాలో తోచదు. ఇటువంటప్పుడు మరళా వారితో మాట్లాడాలి అనిపిస్తుంది. దీని నుంచి బయట పడేందుకు చిన్న చిన్న లక్ష్యాలను పెట్టుకోండి.
గతం గురించి ఆలోచిస్తూ.. ముందున్న జీవితం గురించి మరిచిపోకుండా.. ముందడగు వేసేదే మరోప్రేకు పునాది అని నిపుణులు చెబుతున్నారు. ఫ్రెండ్స్ ఆలోచించండి