సమత్రా భూకంపం ( 2004 ) 9.1 తీవ్రత, సునామీకి కారణం అయింది. 2 లక్షల 30 వేల మందికి పైగా మరణాలు.

 హైతీ భూకంపం ( 2010 ) 7 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపంలో 2 లక్షల మంది మరణించారు.

సిచువాన్ భూకంపం ( 2008 ) చైనా సిచువాన్ ప్రావిన్స్ భూకంపం 7.9 తీవ్రతతో సంభవించింది. 87,000 మంది మరణించారు.

కాశ్మీర్ భూకంపం ( 2005) పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో వచ్చిన ఈ భూకంపం వల్ల 73,000 మంది మరణించారు.

ఇరాన్ భూకంపం ( 2003) ఇరాన్ బామ్ ప్రాంతంలో 6.6 తీవ్రతతో భూకంపం వచ్చింది. 31,000 మంది మరణించారు.

గుజరాత్ భూకంపం ( 2001 ) భారతదేశం గుజరాత్ కఛ్ ప్రాంతంలో 7.7 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. 20,000 మందికి పైగా మరణించారు.

జపాన్ సునామీ ( 2011 ) సముద్రంలో అడుగున 9.0 తీవ్రతతో వచ్చిన భూకంప ధాటికి సునామీ జపాన్ పై విరుచుకుపడింది. 18,500 మంది మరణించారు.

నేపాల్ భూకంపం ( 2015 ) హిమాలయాల్లో 7.8 తీవ్రతతో వచ్చిన భూకంపం ధాటికి నేపాల్ తీవ్రంగా ఎఫెక్ట్ అయింది. 9,000 మంది మరణించారు.

జావా భూకంపం ( 2006 ) ఇండోనేషియా జావా ద్వీపంలో 6.3 తీవ్రతతో వచ్చిన భూకంపం వల్ల 6,000 మంది మరణించారు.

టర్కీ-సిరియా భూకంపం ( 2023 ) టర్కీ, సిరియా ప్రాంతాల్లో 7.8, 7.5 తీవ్రతతో భారీ భూకంపాలు వచ్చాయి. ఇప్పటికే 11,000 మందికి పైగా మరణించారు.