నిశ్చితార్థం చేసుకొని విడిపోయిన జంటలు.. ఇప్పుడెలా ఉన్నారంటే..?

అఖిల్ అక్కినేని, శ్రీయా భూపాల్ 2016 లో నిశ్చితార్థం చేసుకున్నారు.

మరికొద్ది రోజుల్లో పెళ్లి అనుకొనేలోపు ఈ  జంట నిశ్చితార్ధాన్ని క్యాన్సిల్ చేస్తున్నట్లు ప్రకటించారు.

ఇకపోతే  శ్రీయా మరొకరిని పెళ్లి చేసుకోగా.. అఖిల్ తన కెరీర్ పై ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం అఖిల్ ఏజెంట్ సినిమాలో నటిస్తున్నాడు.

నేషనల్ క్రష్ రష్మిక, కన్నడ హీరో రక్షిత్ శెట్టి తో 2018 లో నిశ్చితార్థం చేసుకొంది.

కొన్ని కారణాల వలన ఈ జంట తమ నిశ్చితార్దాన్ని రద్దు చేసుకొని.. స్నేహితులుగా ఉంటున్నారు. ప్రస్తుతం ఎవరి కెరీర్ ను వారు బిల్డ్ చేసుకుంటున్నారు.

హీరోయిన్ త్రిష, బిజినెస్ మ్యాన్ వరుణ్ మ్యానియన్ తో 2019 లో నిశ్చితార్ధం జరుపుకోంది.

త్వరలో పెళ్లి డేట్ కూడా ప్రకటించిన ఈ జంట కొన్ని కారణాల వలన విడిపోయినట్లు తెలిపి షాక్ ఇచ్చారు.

ప్రస్తుతం త్రిష పెళ్లి గురించి ఆలోచించడం మానేసి స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది.

కోలీవుడ్ హీరో విశాల్, హైదరాబాద్ అమ్మాయి అనీషా రెడ్డి 2019 లో ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు.

పెళ్లి డేట్ ఖరారు చేయకముందే ఈ జంట తమ నిశ్చితార్దాన్ని రద్దు చేసుకున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చారు.

ప్రస్తుతం విశాల్ మరో హీరోయిన్ తో ప్రేమలో ఉన్నట్లు టాక్ నడుస్తోంది.. త్వరలోనే విశాల్ పెళ్లి ఉండనున్నదని వినికిడి.

హీరోయిన్ మెహ్రీన్ ఫిర్జాదా,  కాంగ్రెస్ యువనేత భవ్య బిష్ణోయ్ 2021 లో నిశ్చితార్థం చేసుకున్నారు.

మరో నెలలో పెళ్లి అనగా ఈ జంట తమ నిశ్చితార్దాన్ని క్యాన్సిల్ చేసుకున్నట్లు ప్రకటించారు.

ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ అయ్యిన తర్వాత మెహ్రీన్ కెరీర్ పై ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం తెలుగు సినిమాల్లో నటిస్తూ బిజీగా మారింది.