ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీ విష్ణువు విగ్రహం ఇండోనేషియాలో ఉంది. 

బాలీ ద్వీపంలోని ఉంగాసన్ ప్రాంతంలో ఉన్న ఈ విగ్రహం 122 అడుగుల ఎత్తు, 64 అడుగుల వెడల్పు ఉంటుంది.

రాగి, ఇత్తడితో ఈ విగ్రహాన్ని దాదాపు 24 సంవత్సరాలు కష్టపడి నిర్మించారు.

బప్పా నుమాన్ నువర్తా అనే వ్యక్తి 1979లో ఓ పెద్ద విష్ణు విగ్రహం నిర్మించాలని నిర్ణయించుకున్నాడు.

సుదీర్ఘ కాలం పాటు ప్రణాళిక రచించి, డబ్బు పోగు చేసి.. 1994లో ఈ విగ్రహ నిర్మాణానికి శ్రీకారం చుట్టాడు.

2007 - 2013 మధ్య కాలంలో డబ్బు కొరత ఏర్పడి.. ఈ విగ్రహ నిర్మాణాన్ని ఆపేశారు.

తిరిగి డబ్బులు పోగు చేశాక పనులు ప్రారంభించి, 2018లో ఈ విగ్రహాన్ని పూర్తి చేశారు.

ఈ విగ్రహాన్ని నిర్మించినందుకు.. బప్పా నుమాన్‌ను భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది.