రసాయన మందులతో కళ్లకు హాని కలుగకుండా సన్‌గ్లాసెస్ వాడాలి.
హోలీ వేడుకల్లో మందంపాటి పాత దుస్తులను ధరించాలి.
ముదురు రంగు దుస్తులు మంచిది. ఫుల్‌హ్యాండ్స్ షర్ట్, చేతులకు గ్లౌజులు, కాళ్లకు సాక్స్ వేసుకోవాలి.
కళ్లల్లో రంగు పడితే వెంటనే చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. మంట అనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలి.
తలపై రంగులు పడకుండా క్యాప్ పెట్టుకోవాలి. రంగులు చల్లుకోవడం పూర్తయ్యాక గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి.
పసుపు, కుంకుమ, పూలు, పండ్లు వివిధ రకాల పిండిని నీటిలో కలిపి ఉపయోగించుకోవచ్చు.
మోదుగు పూలను ఉడక బెట్టి సహజ సిద్ధమైన రంగు తయారు చేసుకొని వాడవచ్చు.
గంధం, ఎర్రమందార, గోగుపూలు, దానిమ్మ తొక్క, టమాట, క్యారెట్, పసుపు, సున్నం మిశ్రమం కలిస్తే ఎరుపు రంగు వస్తుంది.
శనగపిండి, పసుపు మిశ్రమం, బంతి, చామంతి పూల మిశ్రమంతో పసుపురంగు వస్తుంది.
గోరింటాకు, గుల్‌మొహర్ ఆకులు, గోధుమ మొలకలు, పాలకూర, కొత్తిమీర, పుదీనాతో ఆకుపచ్చ రంగు తయారు చేసుకోవచ్చు.