కరోనా పీడకలను మర్చిపోకముందే తాజాగా మరో మహమ్మారి భయపెడుతోంది. 

ఆఫ్రికాను వణికిస్తున్న మంకీపాక్స్‌ ఇప్పుడు భారత్‌ పొరుగు దేశమైన పాకిస్థాన్‌కు చేరింది.

  ఈ వ్యాధిని 1958లో తొలిసారి గుర్తించారు. 1970లో మొదటిసారిగా ఓ మనిషికి ఇది సోకింది. 

 ముఖ్యంగా ఉష్ణమండల ఆఫ్రికా దేశాల్లోని మారుమూల గ్రామాల్లో మాత్రమే ఎక్కువగా కనిపించేది. 

దీంతో ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, ఆరోగ్య విభాగాలు దీనిని నిర్లక్ష్యం చేశాయి. 

తొలిసారి 2022లో భారీస్థాయిలో మంకీపాక్స్‌ వ్యాపించింది. దీంతో ఉలిక్కిపడిన ప్రపంచ దేశాలు దీనిపై పరిశోధనలకు నిధులను పెంచాయి.  

ఈ వైరస్‌ మనిషి శరీరం లోపలికి ప్రవేశించిన తర్వాత 1 నుంచి 21 రోజుల్లో ఎప్పుడైనా లక్షణాలు బయటపడవచ్చు.  

 పొక్కులు, జ్వరం, గొంతు ఎండిపోవడం, తల, కండరాల నొప్పులు, వెన్ను నొప్పి, నిస్సత్తువ వంటివి ఉంటాయి. 

 ఇవి దాదాపు 2 నుంచి 4 వారాలపాటు కొనసాగవచ్చు.  

 ఇది సదరు వ్యక్తి రోగ నిరోధక శక్తిపై ఆధారపడి ఉంటుంది.