బీఎఫ్-7... ప్రపంచదేశాలు ఇప్పుడీ కరోనా వేరియంట్ నామస్మరణ చేస్తున్నాయి.
మూడేళ్ల పాటు వణికించిన కరోనా సద్దుమణిగిందని అనుకుంటే ఒమిక్రాన్ బీఎఫ్-7 వేరియంట్ రంగప్రవేశం చేసింది.
చైనాలో ఇప్పుడు నెలకొన్న భయానక పరిస్థితులకు ఈ కొత్త వేరియంటే కారణం.
బీఎఫ్-7 రకాన్ని భారత్ లోనూ గుర్తించడంతో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
బీఎఫ్-7 కూడా దాదాపు గత కరోనా లక్షణాలే కలిగిస్తుందని వైద్యులు తెలిపారు.
సాధారణంగా జ్వరం, దగ్గు, గొంతునొప్పి, ముక్కు కారడం, నీరసం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
మరికొందరిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, తీవ్రమైన దగ్గు, అలసట, ఆక్సిజన్ స్థాయిలు పడిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
కరోనా వేరియంట్లకు సంబంధించి భారతీయులు ఇప్పటికే వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకున్నారట.
కానీ, ఈ వైరస్ జన్యువులు తరచుగా రూపాంతరం చెందుతుంటాయని, అందువల్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
ఒక్కోసారి కరోనా వైరస్ ప్రమాదకర రీతిలో జన్యుమార్పులకు గురవుతుంది.
మానవులు అప్పటివరకు పొందిన వ్యాధినిరోధక శక్తి కూడా దానిముందు పనిచేయదంటున్నారు నిపుణులు.