నేల లోపల పండే దుంపలలో ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని మన ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
అలాంటి దుంపలలో స్వీట్ పొటాటోస్ లేదా చిలగడదుంపలు కూడా మన ఆరోగ్యానికి చాలా మంచివి.
ఇందులో కార్బో హైడ్రేడ్స్, ప్రోటీన్లు, కేలరీలు అధికంగా ఉంటాయి. ఈ రూట్ వెజిటేబుల్ పోషకాలతో సమృద్దిగా ఉంటుంది.
ఇందులో ప్రొటీన్, విటమిన్ ఎ, విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
ఇది బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారికి, శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారికి, ఆర్థరైటిస్‌తో పోరాడుతున్న వారికి, చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
కానీ కొన్ని వ్యాధులు ఉన్నవారు దీనికి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇది వారికి హాని చేస్తుంది.
కిడ్నీలో రాళ్లు ఏర్పడితే ఆహారంలో చిలగడదుంపను ఎక్కువగా చేర్చుకోవడం మంచిది కాదు.
పొట్ట సమస్యలతో బాధపడుతున్నప్పుడు చిలగడదుంపను ఎక్కువగా తీసుకోవడం వల్ల విరేచనాలు, కడుపు నొప్పి, ఉబ్బరం వంటివి వస్తాయి.
చిలగడదుంప శరీరంలో రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. కానీ అది ఎక్కువగా తీసుకోకూడదు. ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది.
చిలగడదుంప అతిగా తీసుకుంటే ప్రమాదకరం. పొటాషియం అధికంగా తీసుకోవడం వల్ల హైపర్‌కలేమియా లేదా పొటాషియం టాక్సిసిటీకి దారి తీయవచ్చు ఇది గుండెపోటుకు దారితీస్తుంది.