మహేష్ బాబు మేకప్ లేకుండా ఓ సినిమాలో నటించారనే విషయం చాలా తక్కువ మందికే తెలుసు.

ఆ సినిమా మరేదో కాదు మహేష్ బాబు కెరియర్ లోని వన్ ఆఫ్ ది డిజాస్టర్ సినిమాగా మిగిలిపోయిన " నిజం".

తేజ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా కోసం మహేష్ బాబు ఇంచ్ మేకప్ కూడా వేసుకోలేదట.

నేచురల్ లుక్స్ తో ఫేస్ వాష్ చేసుకుని స్క్రీన్ పై కనిపించాడట.

ఈ సినిమా కథపరంగా జనాలకు నచ్చినా స్క్రీన్ ప్లే పరంగా ఫ్లాప్ అయింది.

అంతేకాదు మహే బాబుని అలా అమ్మచాటు బిడ్డగా చూడడానికి అంగీకరించలేదు సూపర్ స్టార్ ఫ్యాన్స్.

దీంతో సినిమాను అట్టర్ ఫ్లాప్ చేసి పక్కన పడేసారు.

అయినా కానీ ఈ సినిమాలో మహేష్ బాబు నటనకు మంచి మార్కులే పడ్డాయి.

ఇప్పటివరకు తన కెరియర్లు చేసిన సినిమాలలో ప్రతి సినిమాలోని మహేష్ బాబు మేకప్ తో కనిపించారట.

ఈ ఒక్క సినిమా కోసమే మహేష్ బాబు న్యాచురల్ లుక్స్ లో కనిపించి మెప్పించాడు.