హీరో సుమంత్- హీరోయిన్ కీర్తిరెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

కీర్తి రెడ్డి అర్జున్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

సుమంత్ సోదరి ద్వారా అతడికి కీర్తిరెడ్డితో పరిచయం ఏర్పడింది. 

ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో సుమంత్ - కీర్తి రెడ్డి 2004 లో పెళ్లి చేసుకున్నారు.

పెళ్ళైన రెండేళ్లకే ఈ జంట విడాకులు తీసుకుంది.

కీర్తిరెడ్డి సుమంత్ ను సినిమాలు వదిలే అమెరికా వచ్చేస్తే అక్కడ తన ఫ్యామిలీ బిజినెస్లు చూసుకోవచ్చని కోరగా... సుమంత్ అందుకు నిరాకరించాడు.

చివరకు ఆ గ్యాప్ పెద్దది కావడంతో విడాకులు తీసుకుంది. విడాకుల తర్వాత కీర్తిరెడ్డి రెండో పెళ్లి కూడా చేసుకుంది.

 సుమంత్ విడాకుల తరవాత మళ్లీ పెళ్లి చేసుకోకుండా ఉండిపోయాడు తన రెండో పెళ్లి విషయం పై సుమంత్ గతంలోని క్లారిటీ ఇచ్చాడు.

కీర్తిరెడ్డి తో విడాకుల తరవాత చాలా సంతోషంగా ఉన్నానని చెప్పారు.

 పెళ్లి చేసుకోవాల్సి వచ్చినప్పుడు చేసుకుంటా అంటూ కామెంట్ చేశాడు.