ఎండలు మండుతున్నాయి. వేడి ఎక్కువగా ఉండటంతో పలు రకాల డ్రింగ్స్ తాగుతుంటాం.
ఇందులో కొన్ని పానీయాలు మన మెదడు ఆరోగ్యాన్ని నీరసం చేస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కోలా, ఫ్రూట్ జ్యూస్‌లు వంటి అధిక చక్కెర కలిగిన పానీయాలు మెదడులో రక్త ప్రసరణను తగ్గిస్తాయి.
ఇవి డిమెన్షియా వంటి సమస్యలకు దారితీస్తాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
అతిగా కాఫీ తాగడం వల్ల మెదడు అలసిపోతుంది. ఒత్తిడి హార్మోన్లను పెంచి, ఆందోళన స్థాయిలను రెట్టింపు చేస్తుంది.
అతిగా మద్యం సేవించడం వల్ల మెదడు కణాలు దెబ్బతింటాయట.
కెఫీన్, టౌరిన్ వంటి రసాయనాలతో కూడిన ఎనర్జీ డ్రింక్స్ మెదడును బలహీన పరుస్తాయి.
ఇవి నిద్రలేమి, ఆందోళన వంటి మానసిక సమస్యలకు కారణమవుతాయి.
కృత్రిమ స్వీటెనర్లతో తయారైన డైట్ సోడాలు మెదడు కణాలను దెబ్బతీస్తాయి.