మన దేశంలో వెన్నునొప్పి సమస్య ఎక్కువగా ఆందోళన కలిగిస్తుంది. 

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం.. 80 శాతం మంది పెద్దలు తమ జీవితకాలంలో ఏదో ఒక సమయంలో నడుము నొప్పితో బాధపడురట.  

దీన్ని తగ్గించడానికి రకరకాల బామ్స్‌, ఆయిల్స్‌, మెడిసిన్స్‌ వాడతే.. టెంపరరీ రిలీఫ్‌ ఉంటుంది. కానీ.. శాశ్వతంగా ఉపశమనం లభించదు. 

కొన్ని న్యాచురల్‌ పద్ధతులతో, జాగ్రత్తలతో వెన్నునొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. 

మంచి ఆహారం తీసుకోండి. కొవ్వు ఉండే ఆహారాలు అస్సలు తినకండి. మీ ఆహారంలో చక్కెర తగ్గించండి. 

ఆకుకూరలు, కూరగాయలతోపాటూ... అవిసె గింజలు, సబ్జా గింజలు ఎక్కువగా తీసుకోండి. సీజనల్‌ ఫ్రూట్స్‌ తీసుకోండి.

క్యాల్షియం ఎముకల్ని దృఢంగా చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లూ ఎక్కువే. కరివేపాకులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు ఉంటాయి.  

కంప్యూటర్‌ ముందు గంటల తరబడి కూర్చుని పనిచేస్తే వెన్నునొప్పి ఎక్కువ అవుతుంది. అందుకని మధ్య మధ్యలో విరామం తీసుకోండి. 

 వెన్ను నొప్పి మరీ ఎక్కువగా వస్తుంటే కాస్త గోరువెచ్చని నీటిలో ఉప్పు కలిపి, టవల్‌ను నీటిలో ముంచి, పిండాక దానితో వెన్నుపూసమీద కాపడం పెట్టండి.  

కరివేపాకులో ల్యూటిన్‌, ఫోలిక్‌యాసిడ్‌, ఇనుమూ, క్యాల్షియం, నియాసిన్‌, బీటాకెరొటిన్‌ వంటి పోషకాలెన్నో ఉంటాయి.