రష్యాలో అడ్వాన్స్‌గా హ్యాపీ బర్త్‌డే చెప్పరు. అలా చెబితే బర్త్ డే రోజున చెడు జరుగుతుందని నమ్ముతారు.
అద్దాలను ఒకదానికి ఎదురుగా మరొకటి ఏర్పాటు చేయకూడదని మెక్సికోలో భావిస్తారు. అలా చేస్తే... దెయ్యాలను డైరెక్టుగా అహ్వానించినట్లేనట.
చాప్‌స్టిక్‌లను ఆహారంలో ఉంచినప్పుడు అంటించకూడదని జపనీయులు నమ్ముతారు. అలా అంటిస్తే, చెడు జరుగుతుందని అంటారు.
మీకు ఎవరైనా పదునైన వస్తువులు గిఫ్టుగా ఇస్తే... వారికి ఏదైనా నాణేన్ని తిరిగి ఇవ్వాలట. లేదంటే సంబంధాలు చెడిపోతాయట.
ఫిలిప్పీన్స్ ప్రజల ప్రకారం శ్మశానానికి వెళ్లాక.. తిన్నగా ఇంటికి వెళ్లకూడదట. రెస్టారెంట్ దగ్గరో, షాపు దగ్గరో ఆగి వెళ్లాలట. లేదంటే దెయ్యాలు వెంటే వస్తాయట.
ఇంట్లో ఈల వెయ్యొద్దని లిథువేనియన్లు నమ్ముతారు. విజిల్ వేస్తే... పిశాచాలను పిలిచినట్లే అంటున్నారు.
నీటితో ఉన్న గ్లాసులతో చీర్స్ ఇవ్వకూడదు. జర్మనీలో అలా ఇస్తే.. అవతలి వ్యక్తి చనిపోవాలని కోరుకున్నట్లు లెక్క అని భావిస్తారట.
జపనీస్ ప్రకారం తలను ఉత్తరంవైపు ఉంచి నిద్రపోకూడదట. అటువైపు చనిపోయిన వారు విశ్రాంతి తీసుకుంటారట. అటు తల ఉంచి నిద్రపోతే, దురదృష్టం తప్పదట.
ఆఫ్రికన్ల ప్రకారం తలను పశ్చిమంవైపు ఉంచి నిద్రపోకూడదట. వారికి కూడా జపనీయుల తరహాలోనే నమ్మకం ఉంది. చనిపోయిన పూర్వీకులు పశ్చిమంవైపున రెస్ట్ తీసుకుంటారట.
బ్రిటన్‌లో టేబుల్‌పై షూస్ ఉంచరు. అలా ఉంచితే... ఆ ఇంట్లో ఆ షూస్ వాడే వ్యక్తి చనిపోయినట్లు లెక్క అంట.
కత్తెరతో ఆటలాడొద్దన్నది ఈజిప్ట్ ప్రజల మాట. ఆడితే దురదృష్టం తప్పదట.
మనిషిపై పక్షి రెట్ట వేస్తే.. వారికి అదృష్టం అని రష్యన్లు నమ్ముతారు. సంపద బాగా వస్తుందట.
ఇటలీ ప్రజల ప్రకారం ఇంట్లో గుడ్లగూబ ఉంటే... ఇంట్లో ఎవరో ఒకరు చనిపోతారట.
ఈజిఫ్ట్ ప్రజల ప్రకారం గుడ్లగూబను డైరెక్టుగా చూసినా, దాని అరుపు విన్నా.. త్వరలోనే ఓ భయంకరమైన వార్తను వింటారట. అందుకే వాళ్లు రాత్రిళ్లు అడవికి వెళ్లరట.
ఇంటి బయట కూర్చొని బట్టలు అల్లుకుంటూ ఉంటే... శీతాకాలం మరింత ఎక్కువకాలం కొనసాగుతుందని ఐస్‌లాండ్‌లో నమ్ముతారు.