మంచంపై కూర్చుని భోజనం చెయ్యటము
ఉదయాన్నే ఇళ్ళు, వాకిలీ శుభ్రం చెయ్యకపోవటము
లేచింది మొదలు భర్తనీ, పిల్లల్ని తిట్టటము, అరపటము, విసుక్కోవటము.
సాయం సమయాస సంధ్య దీపం ఉంచకపోవటము
సరిగా పక్వము చెందని ఆహారాదులను తినడం.
ఆహారాన్ని తీసుకోకముందు, తీసుకున్న తర్వాత నోటిని శుభ్రపరచుకోకుండా ఉండటము.
ఉదయాన్నే లేచి ముఖం కడుక్కోకుండా భర్తకు కనపడటము వల్ల అనారోగ్యం, ధనహీనత కలుగుతాయి.
తడిబట్టలతో భోజనాన్ని చేయటము
తదియనాడు దొండకాయను తినటము
తమలపాకుల కన్నా ముందు వక్కలు నమలటము. ఇవన్నీ దారిద్ర్యాన్ని తెస్తాయి...
ధనాన్ని ఉత్తరము వైపున్న గదిలో జాగ్రత్త చేయటం ద్వారా కుబేరుని పీతిని పొందగలరు.