ఉల్లిపాయలు ఆరోగ్యానికే కాదు అందానికి కూడా సహాయపడుతుంది.

ఉల్లిపాయలోని యాంటీసెప్టిక్‌ గుణాలు చర్మ సమస్యలకు చెక్‌ పెడతాయి. మచ్చలను తొలగిస్తాయి.

టేబుల్‌ స్పూన్‌ ఉల్లి రసంలో టేబుల్‌ స్పూన్‌ ఆలివ్‌ ఆయిల్‌ కలిపి ఫేస్‌ప్యాక్‌ లా వేయాలి.

ఆరిన తర్వాత గోరు వెచ్చటి నీటితో కడిగేయాలి. మీ ముఖంలో నిగారింపు మీకే తెలుస్తుంది.

టీ స్పూన్‌ పసుపులో సరిపడా ఉల్లిపాయ రసాన్ని కలిపి పేస్ట్‌లా చేయాలి.

దీనిని ముఖానికి ప్యాక్‌ లా వేసుకోవాలి. ఆరిన తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి.

శనగపిండి, ఉల్లిరసం, పాలు .. మూడూ సమపాళ్లలో తీసుకొని పేస్ట్‌లా ముఖానికి రాసుకుని.. కాసేపటి తర్వాత కడిగితే మొహం చంద్రబింబమే.

అతినీల లోహిత కిరణాల వల్ల చర్మం దెబ్బతినే ప్రమాదాన్ని ఉల్లి తగ్గిస్తుంది.

ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు యూవీ కిరణాల వల్ల కలిగే హానిని అడ్డుకుంటాయి.

Spots can be reduced with onion juice 📷