ఉదయాన్నే నిద్రలేవగానే చేయకూడని పనులు గురించి తెలుసుకోవాలి. నిద్రలేవగానే దేవుడు ఫోటోకు దండం పెట్టుకోవడం, తమకు ఇష్టమైన వారు, చిన్న పిల్లల ముఖం చూడటమో చేస్తారు.
కొందరు వీటిని మూఢనమ్మకాలుగా కొట్టిపారేసి అస్సలు పట్టించుకోరు. అయితే కొంతమంది చెడు జరిగితే మాత్రం ఎవరి ముఖం చూశామోనని మధనపడిపోతారు.
ఇప్పుడంటే జుట్టు విరబోసుకోవడం ఓ ఫ్యాషన్ అయిపోయింది కానీ.. అప్పట్లో జట్టు విరబోసుకోవడం అంటే అపచారం అశుభం.
పడకగదిలో అద్దం మాత్రం ఉంచకూడదు. ఎందుకంటే పొద్దున్న నిద్ర లేవగానే అద్దంలో మన ముఖాన్ని చూడరాదు. ఒకవేళ ఉంటే రాత్రి పడుకునే ముందు దాన్ని కప్పి ఉంచండి.
ఉదయం లేవగానే జుట్టు విరబోసుకుని ఉన్న భార్య లేదా మహిళ ముఖాన్నిచూడవద్దు. హిందూ సంప్రదాయం ప్రకారం మహిళ నుదుటిన బొట్టు పెట్టుకోవాలి.
జుట్టు విరబోసుకుని తిరగడం పిశాచాలకు ఆహ్వానం పలకడమే, ఇలాంటి వారిని దుష్టగ్రహాలు ఆవహిస్తాయి
జుట్టు విరబోసుకుని ఉన్న స్ర్తీపై పురుసుడికి కామం కలుగుతుంది
భార్య జుట్టువిరబోసుకుని కనిపిస్తే మాత్రం భర్తను ప్రేమ తగ్గుతుంది, ముఖ్యంగా నిద్రలేవగానే జుట్టువిరబోసుకున్న భర్యాని చూస్తే అరిష్టం
ఈ చర్య లక్షీదేవి అక్కను ఆహ్వానం పలకడమే.. లక్ష్మీదేవి అక్కంటే ఎవరో తెలుసుకదా జ్యేష్టా దేవి
దేవతా ప్రతిమల్లో అమ్మవారు జుట్టు విరబోసుకుని ఉంటారెండుకు అనే అనుమానం మీకురావొచ్చు. దానికి సమాధానం ఉంది.
ఏ దేవతా రూపమైనా ఆది పరాశక్తి స్వరూపమే. పరాశక్తి నిర్గుణ స్వరూపం, సత్వచ రజో, తమో గుణాలు ఆమెలో ఉండవు. అమ్మవారు కామాన్ని హరించేదే కానీ పెంచేది కాదు.