మంగళయాన్ (మార్స్ ఆర్బిటార్ మిషన్) ఇండియా పంపిన తొలి ఇంటర్ ప్లానెటరీ మిషన్

ఎనిమిదేళ్ల తరువాత మంగళయాన్ ప్రస్థానం ముగిసింది. 

నవంబర్ 5, 2013న ప్రయోగించిన మంగళయాన్ 2014 సెప్టెంబర్ లో అరుణ గ్రహాన్ని చేరుకుంది.

తొలి ప్రయత్నంలోనే మార్స్ ఆర్బిటార్ ను కక్ష్యలో ప్రవేశపెట్టినందుకు ఇస్రో రికార్డ్ క్రియేట్ చేసింది.

మంగళయాన్ బడ్జెట్(రూ.454 కోట్లు), హాలీవుడ్ సినిమా ‘గ్రావిటీ’(రూ.644 కోట్లు) కన్నా తక్కువ.

మార్స్ పైన దుమ్ము తుఫానులు కొన్ని వందల కిలోమీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయని కనిపెట్టింది. 

మార్స్ కు సంబంధించిన ఫోటోలు, దాని ఉపగ్రహాల చిత్రాలను పంపింది. 

2024లో మంగళ్ యాన్-2 ప్లాన్ చేస్తోంది ఇస్రో.