హైడ్రా అంటే ‘హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్’.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలో నుంచి ఇటీవలే ఏర్పాటైంది. హైదరాబాద్ నగర పరిధిలోని చెరువులు కబ్జాకు గురికాకూడదనే ప్రధాన లక్ష్యం.
హైడ్రా కు ఛైర్మన్‌గా ముఖ్యమంత్రి వ్యవహరిస్తారు.
అంతేకాకుండా ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల మంత్రులు ఇందులో సభ్యులుగా ఉంటారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ప్రిన్సిపల్ సెక్రెటరీ, జీహెచ్‌ఎంసీ మేయర్ కి కూడా ఇందులో చోటు కల్పించారు.
హైడ్రా అంటే ‘హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్’.
ఏవీ రంగనాథ్ ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గే ఆఫీసర్ కాదనే పేరుంది. కీలకమైన కేసుల్లో రంగనాథ్ తన మార్క్ చూపించారు.
విపత్తుల నిర్వహణ, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, చెరువులు, నాలాల కబ్జాలకు అడ్డుకట్ట వేయటం, ఆక్రమణలను తొలిగించటం, అక్రమ నిర్మాణాలపై హైడ్రా చర్యలు తీసుకుంటుంది.
నిబంధనలను పాటించని ఫ్లెక్సీలు, హోర్డింగ్లు, ప్రకటనల తొలిగింపు వంటివి కూడా హైడ్రా కిందకే వచ్చాయి.
ఇప్పటికే పని ప్రారంభించిన హైడ్రా… చాలాచోట్ల అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది.
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో ఉన్న చెరువుల రికార్డులన్నింటిని పరిశీలిస్తోంది.