నిద్రవేళకు ముందు సెంటెడ్‌ క్యాండిల్స్‌ వెలిగిస్తే.. కొవ్వొత్తి జ్వాల శక్తివంతమైన నిద్ర ఆరోగ్యాన్ని పెంచుతుంది.

ముఖ్యంగా పెద్ద వయసులో వారికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.

కళ్ళు నీలి కాంతికి గురికాకుండా నిరోధించడమే కాకుండా మానసిక ప్రశాంతతను ప్రోత్సహిస్తుంది.

మెదడు అత్యంత ముఖ్యమైన విధుల్లో ఒకటి జ్ఞాపకశక్తి.

సువాసన గల కొవ్వొత్తులు వాడినట్లయితే ప్రయోజనకరంగా ఉంటుంది.

జ్ఞాపకశక్తి, భావోద్వేగం అన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. మంచి అనుభూతిని కలిగిస్తాయి.

ఒకరి మానసిక స్థితి, ఉత్పాదకత స్థాయి, ఒత్తిడిపై వాసన ప్రభావం గణనీయంగా ఉంటుంది.

ప్రత్యేకించి సువాసనగల కొవ్వొత్తులు మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి. ఆందోళనను తగ్గిస్తాయి.a

కొన్ని రకాల కొవ్వొత్తుల సువాసనలు శరీరంలోని కార్టిసాల్ స్థాయి లను తగ్గించి ఒత్తిడి నుంచి బయట పడేస్తాయి.

క్రమం తప్పకుండా మైండ్‌ఫుల్‌నెస్, మెడిటేషన్ సాధన చేసేవారికి సెంటెడ్‌ క్యాండిల్స్ సన్నిహిత స్నేహితులుగా ఉంటాయి.

జాస్మిన్, లావెండర్, పిప్పరమింట్ వంటి రకాలు ఆహ్లాదకరమైన వాసనలు అందిస్తాయి.