ప్రపంచంలోని వివిధ దేశాలలో పాములను ఆహారంగా తీసుకుంటారు, తరచుగా సంప్రదాయ వంటకాలు లేదా సాంస్కృతిక పద్ధతుల్లో భాగంగా పామును తింటారు.

చైనా : పాము మాంసం కొన్ని ప్రాంతాలలో ముఖ్యంగా దక్షిణ చైనాలో రుచికరమైనదిగా పరిగణించబడుతుంది.

వియత్నాం : ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పామును సాధారణంగా తింటారు. కొన్ని రెస్టారెంట్లు లైవ్ స్నేక్ వంటకాలను అందిస్తాయి. 

థాయిలాండ్ : థాయిలాండ్‌లో పాము మాంసాన్ని మార్కెట్‌లలో చూడవచ్చు. 

యునైటెడ్ స్టేట్స్ : లూసియానా వంటి కొన్ని దక్షిణాది రాష్ట్రాల్లో పండుగల సమయంలో ఆహార పదార్థంగా తింటారు.

బ్రెజిల్ : కొన్ని దేశీయ కమ్యూనిటీలు పాము మాంసాన్ని తింటాయి.  కొన్ని ప్రాంతీయ వంటలలో కూడా దీనిని చూడవచ్చు.

మెక్సికో : కొన్ని ప్రాంతాలలో పాము సంప్రదాయ వంటలలో ఉంటుంది, తరచుగా సుగంధ ద్రవ్యాలతో తయారు చేయబడుతుంది.

భారతదేశం : కొన్ని ప్రాంతాలలో పాము మాంసాన్ని వినియోగిస్తారు.

ఇండోనేషియా : పాము మాంసాన్ని కొన్నిసార్లు తింటారు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, వివిధ సంప్రదాయ వంటకాలలో తయారుచేస్తారు.

మలేషియా: మలేషియాలో కూడా కొన్ని ప్రాంతాల్లో పాము మాంసాన్ని తింటారు. 

కాంబోడియా, లావోస్‌, తైవాన్, ఫిలిప్పీ్న్స్‌ వంటి దేశాల్లో కూడా పాము మాంసాన్ని భుజిస్తారు.