పాముల చెవుల విషయంలో భిన్నమైన వాదనలున్నాయి.
చిన్నచిన్న శబ్దాలను సైతం వినగలిగే శక్తి పాములకు ఉందని కొందరు అంటుంటారు.
అందుకే కొన్ని సందర్భాల్లో
'నీవి పాములు చెవులు'
అనే మాటలు మనకు వినిపిస్తుంటాయి.
నిజానికి పాములకు చెవులు ఉండవని కొన్ని పరిశోధనల్లో తేలింది.
మరి నాగస్వరానికి పాములు నృత్యం ఎందుకు చేస్తాయని మీకు డౌట్ వచ్చే ఉంటుంది.
నాగస్వరం శబ్దాన్ని పాము వినలేదు.
కాకపోతే నాగస్వరం ఊదే వ్యక్తులు నేలపై అడుగులు బలంగా వేస్తూ ఉంటారు.
ఆ అడుగుల వల్ల ఏర్పడిన వైబ్రేషన్ ను పాము గ్రహిస్తుంది.
అందుకే నేలపై చేతితో కొట్టినప్పుడు కూడా పడగవిప్పి అటూఇటూ లేచి ఆడుతుంది.
పామును ఆడించాలంటే నాగస్వరమే అవసరం లేదు.
మనం చేతితోనూ నేలపై వైబ్రేషన్లను సృష్టిస్తే పాములు లేచి ఆడుతుంది.