సూర్యరశ్మి, విటమిన్-డిని పొందండి..
సూర్యరశ్మిలోని ఆల్ట్రావయెలెట్ కిరణాలు, విటమిన్ డి సోరియాసిస్ లక్షణాలను తగ్గిస్తాయి.
వదులైన కాటన్ దుస్తులను ధరించాలి.
శరీరాన్ని, చర్మాన్ని చిరాకు పెట్టే దుస్తులకు దూరంగా ఉండాలి. కాటన్ వంటి మెత్తని దుస్తులను ధరించాలి.
చర్మాన్ని మాయిశ్చరైజింగ్ చేయాలి.
ఎండవేడికి గురికాకుండా, చర్మ పొడిబారకుండా మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ అప్లై చేయాలి.
షేవింగ్ చేసుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి.
షేవ్ చేసుకునే సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. చర్మంపై గాయాలు సోరియాసిస్‌ను ఎక్కువ చేస్తాయి.
ఆల్కాహాల్ తీసుకోవడం తగ్గించాలి.
ఆల్కాహాల్ సోరియాసిస్ లక్షణాలను పెంచుతుంది. ఇతర సమస్యలకు దారి తీస్తుంది.
చర్మాన్ని చల్లగా ఉంచాలి.
వేసవిలో చర్మాన్ని చల్లగా ఉంచేలా చూడాలి. చాలా వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటే ఇళ్లలోనే ఉండాలి. చెమట ఎక్కువగా వస్తే చర్మంపై దురద వచ్చే అవకాశం ఉంది.
కీటకాల నుంచి జాగ్రత్తగా ఉండాలి.
దోమలు, ఇతర కీటకాలు కుడితే సోరియాసిస్ ఎక్కువయ్యే ప్రమాదం ఉంది.