అకాల వృద్ధాప్యం నుంచి మిమ్మల్ని రక్షించగలిగి, ఎక్కువ కాలం యవ్వనంగా ఉంచేందుకు మీ జీవనశైలిలో ఇటువంటి మార్పులు చేయడం చాలా ముఖ్యం.

జీవనశైలి, పర్యావరణం కారణంగా మీ ముఖంపై అకాల వృద్ధాప్యం సంభవిస్తుంది.

ముందుగా మీరు ప్రతిరోజూ హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి. అందుకు వీలైనన్ని నీళ్లు తాగడం అవసరం.  

నీరు చర్మాన్ని బిగుతుగా ఉంచడం వల్ల చర్మం మెరుస్తుంది. మీరు తగినంత నీరు త్రాగకపోతే మీ చర్మం పొడిబారడం ప్రారంభమవుతుంది.

 ఆహారంలో చక్కెర శాతం తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఆల్కహాల్   మీ చర్మాన్ని దెబ్బతీస్తాయి. ఆల్కహాల్ కి దూరంగా ఉండటం మంచిది.  

వీలైతే రోజు లేదా వారానికి రెండు మూడు సార్లు శారీరక శ్రమ మీ చర్మాన్ని కాపాడుతుంది.  మిమ్మల్ని యవ్వనంగా ఉంచుతుంది.

 ముఖ్యంగా ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల అకాల వృద్ధాప్యం సంభవిస్తుంది. వీలైనంత వరకు భారీ సూర్యరశ్మికి గురికాకుండా ఉండండి.  

మచ్చలు, ముడతలు వంటి అకాల వృద్ధాప్య లక్షణాలను దూరంగా ఉంచడానికి సన్‌స్క్రీన్ ఉపయోగించండి

 చర్మంపై ఎప్పుడూ కఠినమైన ఫేస్ వాష్‌ను ఉపయోగించవద్దు.