తమ చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడం కోసం మహిళలు ఎన్నో రకాలు చిట్కాలు పాటిస్తున్నారు.
అలాంటి వాటిల్లో స్కిన్ ఐసింగ్ ఒకటి. ఆలియా భట్ లాంటి స్టార్ హీరోయిన్ ఈ చిట్కాని పాటిస్తుందంటే, దీని ప్రత్యేకత ఏంటో మీరే అర్థం చేసుకోండి
ఐస్ క్యూబింగ్ వల్ల చర్మం తక్షణ కాంతిని పొందుతుంది.
ఐస్ క్యూబ్స్‌తో మర్దన చేస్తే.. పాలిపోయిన చర్మానికి నిగారింపు వస్తుంది. జిడ్డు వదులుతుంది.
మొటిమల నుంచి ఉపశమనం లభించడమే కాకుండా రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.
చర్మంలోని సహజ నూనెలు బయటికి పోకుండా, సహజత్వాన్ని కాపాడుతుంది.
స్కిన్ ఐసింగ్ వృద్ధాప్య ఛాయలను దరిచేరనీయదు. చర్మ రంధ్రాలను కూడా శుభ్రపరుస్తుంది.
ఐస్ క్యూబ్‌ను నేరుగా చర్మం మీద ఉంచకుండా, సన్నని గుడ్డలో చుట్టి పెట్టుకుంటే ఇంకా బెటర్.
కలబంద, దోసకాయ రసాలను ఐస్ ట్రేలో పెట్టి.. అవి ఐస్ క్యూబ్స్‌గా మారాక, దాన్ని స్కిన్ ఐసింగ్‌గా వినియోగించవచ్చు.
అయితే.. ఐస్‌ను ఎక్కువసేపు ఒకే చోట పెట్టకూడదు. చర్మమంతా సుతారంగా రుద్దాలి.