కాఫీ: కాఫీలో ఉండే కెఫిన్ చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందని పరిశోధనల్లో తేలింది. కాఫీ పౌడర్‌ను బట్టతల ప్రాంతంలో అప్లై చేస్తే.. రాలిపోయిన జుట్టు తిరిగి పెరుగుతుంది
కొరియాండర్ జ్యూస్: కొత్తిమీరను మెత్తగా పేస్ట్ చేసి, రసం తీసి బట్టతల ప్రదేశంలో అప్లై చేయాలి. ఇలా రెగ్యులర్‌గా చేస్తే, మంచి ఫలితం ఉంటుంది
కోకోనట్ మిల్క్: ఇది ప్రోటీన్స్ అందివ్వడంతో పాటు కొత్త జుట్టు పెరుగుదలను ప్రోత్సాహిస్తుంది. కొబ్బరి బోండాలోని నీరు నేరుగా తలకు అప్లై చేయడం వల్ల కొత్త జుట్టు మొలుస్తుంది
ఆమ్లా, శీకాయ & కుంకుడు కాయ: ఈ మూడింటిని మిక్స్ చేసి, వేడి నీటిలో వేసి బాయిల్ చేయాలి. ఈ వాటర్‌ను రెగ్యులర్‌గా అప్లై చేస్తే, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది
నిమ్మరసం & బ్లాక్ పెప్పర్ సీడ్స్: బ్లాక్ పెప్పర్ పౌడర్ లో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి బట్టతల ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సాహిస్తుంది
మెంతులు: మెంతులను నీటిలో నానెబట్టి, మెత్తగా పేస్ట్ చేసి తలకు అప్లై చేయాలి. బట్టతల సమస్యను ఎఫెక్టివ్ గా తగ్గించుకోవచ్చు
ఆలివ్ ఆయిల్, తేనె & దాల్చిన చెక్క: దాల్చిన చెక్కను పౌడర్‌గా చేసి, అందులో ఆలివ్ ఆయిల్ & తేనె మిక్స్ చేసి, ఈ పేస్ట్‌ను బట్టతల ప్రాంతంలో అప్లై చేయాలి
పెప్పర్ & పెరుగు: పెప్పర్ పౌడర్‌ను పెరుగుతో మిక్స్ చేసి, తలకు అప్లై చేయాలి. ఇలా వారానికొకసారి అప్లై చేస్తే, మంచి ఫలితం ఉంటుంది