మేకప్ అంటే అమ్మాయిలకు ఎంతిష్టమో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు..
మక్కువతోనే కాదు.. వృత్తిలో భాగంగానూ కొంతమంది తరచూ మేకప్ వేసుకుంటారు..
మేకప్ తొలగించుకునే సమయంలోనూ కొన్ని విషయాలు దృష్టిలో ఉంచుకోవాలి: సౌందర్య నిపుణులు
మేకప్ తొలగించుకునే క్రమంలో రిమూవర్ ఉపయోగించినా.. గట్టిగా రుద్దుతూ శుభ్రం చేయొద్దు..
ఒక కాటన్ ప్యాడ్‌పై ఈ రిమూవర్‌ను వేసి ముఖమంతా అప్లై చేసి తొలగించాలి..
చర్మ రంధ్రాల్లోకి చేరిన మేకప్ అవశేషాలు అంత సులభంగా వదిలిపోవు..
రిమూవర్‌తో మేకప్‌ను తొలగించుకున్న తర్వాత ముఖం శుభ్రపరచుకుని, ఓసారి ఆవిరి పట్టుకోవాలి..
మేకప్‌ని తొలగించుకున్న తర్వాత ఆఖర్లో ఫేస్‌వాష్‌తో ఓసారి ముఖాన్ని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది..
మేకప్ ను అలాగే వదిలేస్తే లేనిపోని చర్మ సమస్యలు కొనితెచ్చుకున్నట్లే: సౌందర్య నిపుణులు