మిమ్మల్ని ప్రతి విషయంలో గుప్పెట్లో పెట్టుకోవడానికి ప్రయత్ని్స్తారు. అన్నీ తమకు తెలియాలంటారు. 

ప్రతి విషయంలో అనుమానించడంతో పాటు ఇతరులతో మాట్లాడితే అసూయ కనబరుస్తారు. 

బయటకు వెళ్లినప్పుడు నలుగురిలో కించపరచడంతో పాటు ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తారు.

మీ సోషల్‌ మీడియాను, మొబైల్‌ను తరచూ గమనిస్తూ అనుమానిస్తుంటారు.

మీ అవసరాల గురించి పట్టించుకోరు.. వారి అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలంటారు.  

ప్రతి చిన్న విషయానికి గొడవపడుతూ.. తప్పంతా మీదే అంటూ అరుస్తుంటారు.

ఎదుటివారి మాటల్ని గౌరవించరు.. ఎదురు సమాధానం చెప్తే తనన ధిక్కరిస్తున్నారని భావిస్తారు. 

సరదాగా జీవిత భాగస్వామిని బయటకు తీసుకెళ్లాలని ఎప్పుడూ అనుకోరు. 

శృంగారంలో పాల్గొనాలని ఆసక్తి లేకపోయినా బలవంతం చేస్తారు.

బెదిరింపులకు పాల్పడుతూ మానసికంగా, శారీరకంగా వేధిస్తుంటారు. 

మీకు అండగా నిలిచేవారిని దూరం చేయడంతో పాటు వారిని కలవకుండా చేస్తారు.