నిద్రపోయేటప్పుడు స్వెటర్ వేసుకునే అలవాటు ఉంటే ఈరోజు నుంచి మీరు ఈ అలవాటుకు స్వస్తి చెప్పండి. లేకపోతే ఆనారోగ్య సమస్యలకు గురి చేస్తుంది.

ప్రస్తుతం చలి వాతావరణం పెరిగింది. రక్షించడం కోసం స్వెటర్, జెర్సీ, తలకు స్కార్ఫ్, చేతులకు గ్లౌజులు, కాళ్ళకు సాక్సులు ఉపయోగపడతాయి.

పగటి పూట కంటే రాత్రి సమయంలో చలి తీవ్రత ఎక్కువగా ఉన్నందున పడుకునేటప్పుడు కూడా స్వెటర్ ధరించే వారి సంఖ్య చాలా మందే ఉన్నారు. అయితే ఈ అలవాటు మంచిది కాదంటున్నారు వైద్య నిపుణులు

రాత్రుల్లో నిద్రించేటప్పుడు స్వెటర్ ధరించడం వల్ల శరీరంలో రక్తపోటు పెరుగుతుంది. నిద్రలో ఉన్నప్పుడు మనకు ఈ విషయం తెలియదు.

వెచ్చని దుస్తులలో పడుకోవడం వల్ల శరీరానికి తగినంత గాలి తగలకపోవడం వల్ల చర్మం దురుద, దద్దుర్లు, స్కిన్ ఇన్ఫెక్షన్ వంటి చర్మ సమస్యలు వస్తాయి.

స్వెటర్ ధరించడం వల్ల శరీరానికి తగినంత గాలి అందక, శరీరం వెచ్చగామారుతుంది. ఈ పరిస్థితి ఎక్కువ సమయం కొనసాగితే గుండె ఆరోగ్యానికి కూడా హానికరం.

చలికాలంలో, స్వెటర్ల వెచ్చదనం ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ప్రమాదం

వెచ్చని బట్టలతో పడుకోవడం వల్ల ఆక్సిజన్‌ను నిరోధించవచ్చు. దీనితో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కూడా కలుగుతుంది.

ఉన్ని చేతి తొడుగులు ధరించి నిద్రించడం కూడా హానికరం