ఎన్ని కొత్త రకాల దుస్తులు ఉన్నా
లెగ్గింగ్స్ కు ఉన్న క్రేజ్ వేరే..
కుర్తా, టాప్స్ ఇలా దేనికైనా కరెక్ట్ గా సెట్ అయ్యేవి లెగ్గింగ్స్, స్కూల్ పిల్లల నుంచి కాలేజీ చదువుకునే పిల్లలు వరకూ అందరూ లెగ్గింగ్స్ ను వాడుతారు.
టైట్ ఫిట్ లెగ్గింగ్స్ ను వాడడం వలన ఎంత కంఫర్ట్ గా ఉంటుందో అంతే నష్టం ఉందని నిపుణులు చెబుతున్నారు.
టైట్ ఫిట్ లెగ్గింగ్స్ మీరు అందంగా కనిపించినా సరే దుస్తులు టైట్ గా ఉండడం వలన కండరాల పైన ఒత్తిడి పడి వెన్నునొప్పి వస్తుంది.
టైట్ ఫిట్ లెగ్గింగ్‌తో చర్మంపై దద్దుర్లు వస్తాయి.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది.
టైట్ గా బట్టలు వేసుకోవడం వలన చెమట ఎక్కువగా పట్టి శరీరంలో ఉండే నీటి స్థాయి తగ్గుతుంది.
బిగుతుగా ఉండే లెగ్గింగ్స్ ను వేసుకుంటే రక్తప్రసరణ తగ్గుతుంది.
ఈవిషయాన్ని లైట్ తీసుకుంటే మీకే నష్టం..