చిన్నారుల నుంచి పెద్దల వరకు ఎక్కువ శాతం మంది జీన్స్‌ ప్యాంట్లు ధరిస్తున్నారు. 

 ఫ్యాషన్‌ పేరుతో లేనిపోని అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. 

చాలా మంది ఎక్కువ రోజులు జీన్స్ ధరించడంతో చర్మ సంబంధిత సమస్యలు వస్తున్నాయి.

 జీన్స్ ప్యాంట్లు స్కిన్‌ఫిట్‌లాగా ఉండటంతో గాలి ఆడక లోపల చెమట పట్టి వివిధ రకాల సమస్యలకు దారి తీస్తున్నాయి.

  చర్మం రంగు మారడం, సహజత్వం కోల్పోవడం, ఎర్రగా దద్దుర్లు రావడం వంటి చర్మవ్యాధులు వస్తున్నాయి. 

 కొందరిలో చర్మం పాలిపోయినట్లు కనిపించడం, మంట, దురద, వాపు కూడా వస్తోంది.

 ఎక్కువ ఫిట్‌గా ఉన్న జీన్స్ ధరిస్తే.. కొందరికి పుండుగా మారి చీము కారడం, చర్మం దళసరిగా మారడం జరుగుతోంది. 

 అందరూ వెంటనే జీన్స్ ధరించడం మానేయండి.. మితంగా వేసుకునేందుకు ట్రై చేయండి..

ఒక వేళ ఎప్పుడో ఒకసారి వేసుకున్నా.. టైట్ ఉన్న జీన్స్ కాకుండా.. కొంచెం ఫ్రీ గా ఉన్న దాన్ని ఎంచుకోండి..